మధ్యప్రదేశ్‌లో బీజేపీ హవా.. తొలి రౌండ్ ముగిసే నాటికి..

మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం భాజపా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉదయం 9:55 గంటల సమయంలో బీజేపీ 18 స్థానాలు, కాంగ్రెస్ 9 స్థానాలు ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు. సన్వేర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి తులసి సిల్వత్ 2400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఏడు నెలల క్రితం కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి భాజపా గూటికి సింధియా చేరడంతో ఖాళీ అయిన 25 స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతం భాజపాకు 107, కాంగ్రెస్‌కు 87 మంది ఎమ్మెల్యేలున్నారు. సాధారణ ఆధిక్యాన్ని చేరుకోవాలంటే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని భాజపాకు మరో 8 సీట్లు దక్కితే సరిపోతుంది. 28 స్థానాల్లో ఎక్కువ చోట్ల కాంగ్రెస్ నెగ్గితే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే అవకాశం ఉంది. వీటిలో 27 చోట్ల ఇదివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com