Sharad Pawar : గోవా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : శరద్ పవార్

Sharad Pawar : త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో అప్పుడే రాజకీయ పార్టీలు పొత్తులు, ఎత్తులు వేస్తున్నాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్, టీఎంసీలతో చర్చలు జరుపుతున్నామని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఇప్పటికే తమ స్థానాల జాబితాను రెండు పార్టీలకు అందజేసామని తెలిపారు. కలిసికట్టుగా పోటీ చేయాలనే అంశంపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గోవా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. బీజేపీ గద్దె దిగడం ఖాయమని శరద్ పవార్ జోష్యం చెప్పారు. కాగా గోవాలో ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే 13 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com