Income Tax: బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Income Tax: బీబీసీ కార్యాలయాల్లో  ఐటీ సోదాలు
ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పత్రాలతో పాటు, ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉన్న సమాచారాన్ని సేకరించిన అధికారులు

బీబీసీ కార్యాలయాల్లో వరుసగా రెండు రోజులు ఐటీ సోదాలు జరిగాయి. సోదాల్లో భాగంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పత్రాలతో పాటు, ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉన్న సమాచారాన్ని అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ముంబై, ఢిల్లీల్లో ఉన్న బీబీసీ ఆఫీసులతో పాటు మరో రెండు అనుబంధ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.

ఇక ఐటీ దాడుల నేపథ్యంలో బీబీసీ ఉద్యోగులకు మెయిల్ చేసింది. అధికారులకు ఉద్యోగులు సహకరించాలని, వారు అడిగిన ప్రశ్నలకు సమగ్రంగా సమాధానం ఇవ్వాలని సూచింది. మరోవైపు భారత్‌లోని వీక్షకులకు సేవలు ఎప్పటిలానే కొనసాగుతున్నట్లు బీబీసీ తెలిపింది. అయితే వ్యక్తిగత ఆదాయం గురించి స్పందించకుండా ఉండొచ్చని చెప్పింది. ఇక సర్వే గురించి ఎట్టి పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల్లో స్పందించవద్దని స్పష్టం చేసింది.

మరోవైపు ఐటీ సోదాలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. మోదీ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నాని మండిపడుతున్నారు. ఇక ప్రతిపక్షాలకకు బీజేపీ నేతలు అంతే స్ట్రాంగ్‌ గా కౌంటర్ ఇస్తున్నారు. ఆదాయపు పన్ను విషయంలో ఐటీ దాడులు చేస్తే తమకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలు కావాలనే కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story