India : పాక్ పై ఏ క్షణమైనా భారత్ పైచేయి సాధించవచ్చు : అమెరికా

India : పాక్ పై ఏ క్షణమైనా భారత్ పైచేయి సాధించవచ్చు : అమెరికా
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ఆర్మీ పూర్తి స్థాయిలో విరుచుకుపడటానికి రెడీగా ఉందని తెలిపింది

అమెరికా వార్షిక ఇంటలిజెన్స్ రిపోర్ట్ లో భారత్ ఎప్పటికైనా పాకిస్థాన్ ఆర్మీపై... పైచేయి కనబరుస్తుందని నివేదికను విడుదల చేసింది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ఆర్మీ పూర్తి స్థాయిలో విరుచుకుపడటానికి రెడీగా ఉందని తెలిపింది. మరోవైపు పాకిస్థాన్ ను కవ్వించేందుకు కూడా భారత్ వెనకడుగు వేయడం లేదని పేర్కొంది. పాకిస్థాన్ కు తీవ్రవాదులను పెంచి పోషించిన చరిత్ర ఉందని, సదరు టెర్రరిస్ట్ లను భారత్ పై చాలా సార్లు ప్రయోగించి అలజడులు సృష్టించడానికి పాకిస్థాన్ ప్రయత్నించిందని తెలిపింది. గతంలో కంటే భారత్ రెట్టింపు శక్తితో ప్రతిస్పందించేందుకు రెడీగా ఉందని అమెరికా ఇంటలీజెన్స్ తెలిపింది.


పాకిస్థాన్ నుంచి వెలువడుతున్న సీమాంతర ఉగ్రవాదం కారణంగా కశ్మీర్ సమస్య భారత్ కు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో పాక్ కు భారత్ కు సంబంధాలు మరింతగా దిగజారాయి. రెండు దేశాల సంక్షోభాలు ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా పేర్కొంది. 2021 ప్రారంభంలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణను రెండువైపుల పునరుద్దరించినట్లు చెప్పింది. ప్రస్తుతం న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ లు తమ సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా మొగ్గుచూపుతున్నట్లు అమెరికా అభిప్రాయపడింది.

Tags

Read MoreRead Less
Next Story