Kiwi Fruit : ఆ కివీ పండ్ల దిగుమతిని నిషేధించిన భారత్.. ఎందుకంటే..

Kiwi Fruit : పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతుండడంతో రేటు ఎక్కువైనా కొని తింటున్నారు. కానీ అవే ఆరోగ్యాన్ని పాడు చేసేవని తెలిస్తే తినడానికి భయపడతారు. మార్కెట్లో దొరికే కివీ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిసి వందకి నాలుగైనా కొంటున్నారు. కానీ ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆ పండ్లు తెగులు సోకినవని భారత్ వాటిని నిషేధించింది.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నోడల్ బాడీ నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ (NPPO) డిసెంబర్ 7 నుండి ఇరాన్ నుంచి దిగుమతి అవుతున్న కివీ పండ్లను భారత్ నిషేధించింది. ఈ మేరకు NPPOలోని ఇరాన్ కౌంటర్‌కు రాసిన లేఖలో మంత్రిత్వ శాఖ పేర్కొంది.
భారతదేశం నిర్దేశించిన నాణ్యతా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పదేపదే హెచ్చరించినప్పటికీ ఇరాన్ నుండి తెగులు సోకిన కివీ పండ్ల దిగుమతి పెరిగిందని పేర్కొంది.
ప్రతి దేశానికి తనను తాను రక్షించుకునే అధికారం ఉన్నందున కివీ పండ్ల దిగుమతిని భారత ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం, భారతదేశం వివిధ దేశాల నుండి 4,000 టన్నుల కివీస్‌ను దిగుమతి చేసుకుంటుండగా, దేశీయ ఉత్పత్తి దాదాపు 13 శాతం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com