India corona cases : మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..!

India corona cases : మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..!
దేశంలో కరోనా ఉదృతి కోనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కేసులు నలబై వేలకి పైగానే నమోదు అవుతున్నాయి.

దేశంలో కరోనా ఉదృతి కోనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కేసులు నలబై వేలకి పైగానే నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,909 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 70% శాతం కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. అటు మరణాలు కాస్త తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. నిన్న కరోనాతో పోరాడుతూ మరో 380 మంది ప్రాణాలను కోల్పోయారు. దీనితో మొత్తం 4,38,210 మంది కరోనాతో మరణిచారు. ఇక ఒక్క రోజులో 34763 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,76,324 యాక్టివ్ కేసులున్నాయి. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం మరో 31,14,696 మందికి టీకాలు వేశారు.

Tags

Next Story