Indian Army: ఫ్లయింగ్ సోల్జర్ వచ్చేస్తున్నాడు

ఇండియన్ ఆర్మీలో జెట్ స్పీడ్‌తో పయనించే ఫైటర్ జెట్‌లు, డ్రోన్లలతో పాటు త్వరలో ఫ్లయింగ్ సోల్జర్ కూడా వచ్చి చేరనున్నాడు. ప్యారాచూట్‌ల అవసరం లేకుండానే పక్షిలా ఎగురుతూ టార్గెట్‌ను చేరేందుకు బెంగళూరుకు చెందిన అబ్సల్యూట్ కంపోజిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ కంపెనీ జెట్‌ప్యాక్ తయారు చేసింది. బెంగళూరులో నిర్వహిస్తున్న ఏరో ఇండియా ఎక్స్‌పోలో ఈ జెట్‌ప్యాక్‌లు దేశ, విదేశ ఆర్మీలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
టర్బోజెట్ లాంటి ఫ్యూయల్ బాడీఈ జెట్‌ప్యాక్‌లో ఉన్నాయి. చిన్నపాటి కంప్రెసర్లతో కూడిన టర్బో ఇంజిన్, 30 లీటర్ల డీజిల్ ట్యాంకును సెట్ చేశారు అమర్చారు. ఎయిర్ ఇన్‌లెట్ కాంపాక్ట్ ఫ్లయింగ్ మిషన్ తో ఫ్లై సిస్టం కూడా ఉంది. పర్వతాలు, ఎడారులు, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో రక్షణ చర్యలు, హిట్ అండ్ రన్ ఛేజింగ్‌లో సైనిక సేవలను మరింత వేగంగా, సమర్థంగా అందించేందుకు జెట్‌ప్యాక్‌లు ఉపయోగపడతాయని స్టార్టప్ కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇది ధరించిన సైనికుడు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో 15 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలడు. వీటిని 70శాతం స్వదేశీ పరిజ్ఞానంతో, పేలోడ్‌తో కలిపి 80 కిలోల బరువుతో తయారు చేశారు.
డిజైన్ అవర్ డెస్టినీ మంత్రంతో భారత్ దూసుకెళ్తోందిని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. 2023-24 బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయించిన మూలధనంలో 75శాతం స్వదేశీ ఉత్పత్తుల తయారీ కోసమే వినియోగించనున్నామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com