Indian Army : మిసైల్స్ మిస్ ఫైర్

Indian Army : మిసైల్స్ మిస్ ఫైర్

మూడు మిసైల్స్ మిస్ ఫైర్ అయినట్లు తెలిపారు ఆర్మీ అధికారులు. రెగ్యులర్ ఎక్సర్ సైజ్ లో భాగంగా టెక్నికల్ ఇష్యూ వలన మిస్ ఫైర్ జరిగినట్లు చెప్పారు. రాజస్థాన్ లోని జైసల్మీర్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పోక్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో మూడు మిసైల్స్ మిస్ అయినట్లు చెప్పారు. ఈ మూడు మిసైల్స్ మామూలు రేంజ్ కంటే ఎక్కువగా దూసుకు వెళ్లాయని చెప్పారు. చుట్టు పక్కల గ్రామాలలో మాసైల్స్ పడినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరుగలేదని స్ఫష్టం చేశారు.

డిఫెన్స్ స్పోక్స్ పర్సన్ లెఫ్టినెంట్ కల్నల్ అమితాబ్ శర్మ మాట్లాడుతూ... మిలిటరీ ఎక్సర్ సైజ్ లో భాగంగా... మిసైల్స్ మిస్ ఫైర్ అయ్యాయని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చర్యలు తప్పవని తెలిపారు.

మూడింటిలో రెండు మిసైల్స్ ను కనెగొన్నట్లు తెలిపారు. మరో మిసైల్ కోసం వెదుకుతున్నట్లు చెప్పారు. పోలీసులు, ఆర్మీ అధికారులు మిసైల్ ను వెతుకుతున్నారని అన్నారు. 10 - 25 కిలోమీటర్ల పరిధిలో మిసైల్ ను టెస్ట్ చేశామని.. టెక్నికల్ ఇష్యూ వలన మిస్ ఫైర్ జరిగినట్లు తెలిపారు. నాచానా డిప్యుటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కైలాష్ వైష్టోయ్ మాట్లాడుతూ... మొదటి మిసైల్ అజాసర్ విలేజ్ లో, రెండో మిసైల్ మరో స్థలంలో దొరికినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story