Indian couple: జర్మనీ కస్టడీలో చిన్నారి.. విడిపించమని మోదీకి మొరపెట్టుకుంటున్న తల్లిదండ్రులు

Indian couple: జర్మనీ కస్టడీలో చిన్నారి.. విడిపించమని మోదీకి మొరపెట్టుకుంటున్న తల్లిదండ్రులు
Indian couple: అరిహా అనే రెండేళ్ల కుమార్తె తల్లిదండ్రులు భవేష్, ధరా షా, సెప్టెంబర్ 2021 నుండి ఫోస్టర్ కేర్ ఫెసిలిటీలో ఉన్న తమ బిడ్డను తమకు అందించమని చట్టపరంగా పోరాడుతున్నారు.

Indian couple: అరిహా అనే రెండేళ్ల కుమార్తె తల్లిదండ్రులు భవేష్, ధరా షా, సెప్టెంబర్ 2021 నుండి ఫోస్టర్ కేర్ ఫెసిలిటీలో ఉన్న తమ బిడ్డను తమకు అందించమని చట్టపరంగా పోరాడుతున్నారు. జర్మనీ ప్రభుత్వం నుండి తమ కుమార్తెను తమకు ఇప్పించమని ప్రార్ధిస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ అధికారులను కలవడానికి దంపతులు గురువారం మహారాష్ట్ర రాజధాని ముంబై చేరుకున్నారు.

“ఆమె భారతీయ బిడ్డ. “బేటీ బచావో (ఆడపిల్లను రక్షించండి)” గురించి మాట్లాడే ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్లిష్ట సమయంలో మాకు సహాయం చేయాలి. ఆమె మా బిడ్డ. జర్మన్ చైల్డ్ కేర్ ఫెసిలిటీ నుండి మా బిడ్డను పొందడంలో మాకు సహాయం చేయమని నేను ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాను, ”అని చిన్నారి తల్లి వేడుకుంటోంది. “మా కుమార్తెను సెప్టెంబర్ 2021లో జర్మన్ చైల్డ్ సర్వీసెస్ తీసుకుంది. ఆమె ప్రమాదవశాత్తు ఆమె ప్రైవేట్ ప్రాంతంలో గాయపడటంతో మేము ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాము. ఆమె బాగానే ఉందని తదుపరి చికిత్స అవసరం లేదని వైద్యులు ఇంటికి పంపించారు. మరొకసారి అనారోగ్య కారణంతో ఆస్పత్రికి తీసుకువెళ్లాము. కానీ వైద్యులు ఈసారి మా బిడ్డను మాకు ఇవ్వకుండా పిల్లల సంరక్షణా కేంద్రానికి పంపించారు. పాపకు అయిన గాయాన్ని లైంగిక వేధింపుల చర్యగా అనుమానించి వారి వద్దే ఉంచుకున్నారు.

అన్ని పరీక్షలు చేసిన తరువాత లైంగిక వేధింపులు కాదని నిర్ధారణకు వచ్చారు. అయినా మా బిడ్డను మాకు ఇచ్చేందుకు అంగీకరించలేదు. సామాజిక కార్యకర్త పర్యవేక్షణలో ప్రతి నెలా ఒక గంట పాటు తమ కుమార్తెను కలిసేందుకు అనుమతిస్తున్నట్లు చిన్నారి తల్లి తెలిపారు. "మేము మరిన్నిసార్లు మా పాపను చూసేందుకు అనుమతి కోరగా అందుకు నిరాకరించారు. ఆమెను తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి మాకు సహాయం చేయాలని మేము ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నాము. మేము విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ని కూడా మాకు సహాయం చేయమని అభ్యర్థిస్తున్నాము. ప్రధాని మోడీ జోక్యం చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story