ఉద్యోగం పోయింది.. లాటరీ వచ్చింది.. ఏకంగా రూ.7 కోట్లు

కోవిడ్ వచ్చి కష్టాలు తెచ్చిందని రోజూ బాధపడేవాడు.. కానీ లాటరీ తగిలి లక్కు మారడంతో తెగ సంతోష పడుతున్నాడు. ఉద్యోగం చేస్తే వేలల్లో జీతం చాలీచాలక కుటుంబ భారం కష్టమయ్యేది కేరళలోని కసర్‌గాడ్‌కు చెందిన నవనీత్ సజీవన్‌కు. నాలుగేళ్లుగా అబుదాబిలో ఉంటున్నాడు. కోవిడ్ వచ్చాక ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ సంస్థ అతడిని నోటీస్ పీరియడ్ కింద పని చేయించుకుంటోంది. ఉద్యోగం పోయిన బాధతో ఉన్న డబ్బుల్లో కొంత తీసి లాటరీ టికెట్ కొన్నాడు.
అదృష్టం ఆవగింజంతైనా ఉందో లేదో పరీక్షించుకుందామని లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. టైమ్ బావున్నట్లుంది లాటరీ తగిలింది రూ. 7.4 కోట్లు ఫ్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ఆదివారం దుబాయి డ్యూటీ ప్రీ మిలీనియం మిలియనీర్ డ్రా నిర్వాహకులు నవనీత్‌కు ఫోన్ చేసి విషయం తెలపడంతో మొదట ఆశ్చర్యపోయాడు. వెంటనే తేరుకుని ఎగిరి గంతేశాడు. నవంబర్ 22న నవనీత్ ఆన్‌లైన్‌లో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. కష్టాల్లో ఉన్న తనకు లాటరీ తగలడం కలిసొచ్చిందని.. ఈ డబ్బుతో కుటుంబానికి కావలసిన అవసరాలన్నీ తీరుస్తానని చెప్పాడు. కొంత డబ్బుని సహోద్యోగులకు, స్నేహితులకు ఇస్తానని చెప్పి అతడి మంచి మనసు చాటుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com