Video Viral: ఆడుతూనే కుప్పకూలి.. అంతలోనే గుండె ఆగి..

Video Viral: బ్యాడ్మింటన్ కోర్ట్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఒమన్‌లోని మస్కట్‌లో బ్యాడ్మింటన్ కోర్టులో స్నేహితులందరూ కలిసి సరదాగా ఆడుకుంటున్నారు. అంతలోనే ఆడుతున్న ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు.. పక్కన ఉన్న స్నేహితులు పరుగున వచ్చి చూసేలోపే ప్రాణాలు కోల్పోయాడు. 38 ఏళ్లు ఉన్న ఆ వ్యక్తి కేరళకు చెందినవాడని తెలుస్తోంది. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను క్రీడా ప్రేమికుడని స్నేహితులు చెబుతున్నారు. దేశీయ క్రికెట్ లీగ్‌లో క్రమం తప్పకుండా ఆడేవాడని అన్నారు.
గత కొన్ని నెలలుగా, అకస్మాత్తుగా కుప్పకూలిన వ్యక్తుల వీడియోలు సోషల్ మీడియాలో ఈ మధ్య తరచుగా చూస్తున్నాము. రాజస్థాన్‌లోని ఓ క్లినిక్‌లో డాక్టర్ కోసం వేచి ఉన్న వ్యక్తి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు ఘజియాబాద్‌లోని ఒక జిమ్ ట్రైనర్ కస్టమర్లతో మాట్లాడుతూ కుర్చీలో కూర్చునే అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచాడు.
మరో క్లిప్‌లో వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలడం కనిపించింది. ఈ దృశ్యం అతడి బంధువులు మరియు స్నేహితులను షాక్‌కు గురి చేసింది. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది అప్పటికే ప్రాణాలు కోల్పోయాని డాక్టర్లు వివరించారు. మొన్నటికి మొన్న హోటల్ యజమాని జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేసి ముందుకు నాలుగు అడుగులు వేసి తూలిపోయాడు.
2 Jan 2023 : Indian-origin man dies of 💔 attack💉 while playing on court in Muscat#heartattack2023 #heartattack #cardiacarrest #Myocarditis #ClotShotStrikesAgain pic.twitter.com/m96z2bYcAg
— Anand Panna (@AnandPanna1) January 10, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com