Indian Racing: నగరంలో రెండు రోజులు కార్ రేసింగ్ పోటీలు..

Indian Racing: నగరంలో రెండు రోజులు కార్ రేసింగ్ పోటీలు..
Indian Racing: హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ రెండో దశ పోటీలకు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి.

Indian Racing: హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ రెండో దశ పోటీలకు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నగరంలో రెండు రోజుల పాటు రేసింగ్ పోటీలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కార్‌ రేసింగ్‌ పోటీలు జరగనున్నాయి.




ఇక రేపు ఫైనల్ రేస్ నిర్వహించి, ఛాంపియన్‌ను వెంటనే ప్రకటించనున్నారు. ఈ లీగ్‌లో 12 కార్లు, 6 జట్లు పాల్గొననున్నాయి. ఈ రేస్ కార్లను 24 మంది డ్రైవర్లు నడిపించనున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని నిర్వాహకులు తెలిపారు.



గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని VIPలకు, సందర్శకులకు వేరు వేరు గ్యాలరీల ఏర్పాటు చేస్తున్నారు. ఇక నిన్నటి నుంచే హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కుల‌ను ఈ మూడు రోజులపాటు మూసివేయనున్నారు. ఇటీవల హుస్సేన్ సాగ‌ర్ తీరంలో ఇండియ‌న్ రేసింగ్ లీగ్ నిర్వహణ సమయంలోనూ ట్రాఫిక్ ను మళ్లించారు.



వీవీ స్టాట్యూ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు అనుమతించడం లేదు. వీవీ స్టాట్యూ నుంచి షాదాన్ కాలేజీ వైపుగా రవీంద్రభారతికి ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. బుద్దభవన్ వైపు, నల్లగుట్ట జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్ వైపు, ఐమాక్స్ రోటరీ వైపు నో ఎంట్రీ బోర్డులు పెట్టారు. అటునుంచి నల్లగుట్ట జంక్షన్ మీదుగా రాణిగంజ్, ట్యాంక్ బండ్ మీదుగా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు.




ఇక రసూల్‌పురా, మినిస్టర్ రోడ్ నుంచి వచ్చే వాహనాలను నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నెక్లెస్ రోటరీ సైడ్ అనుమతించడం లేదు. ఆ వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్ వైపు మళ్లిస్తున్నారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను ట్రాఫిక్ తెలుగు తల్లి వైపు అనుమతించడం లేదు. తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ నుంచి కట్ట మైసమ్మ దేవాలయం, లోయర్ ట్యాంక్ బండ్ వైపు ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story