Indian Railways : సౌత్‌ కోస్ట్‌ రైల్వేపై అతి తక్కువ ఖర్చు

Indian Railways : సౌత్‌ కోస్ట్‌ రైల్వేపై అతి తక్కువ ఖర్చు
ఏపీలో సౌత్ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఏర్పాటుపై రాజ్యసభలో ఎంపీల ప్రశ్నకు రాతపూర్వక సమాధానం

సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌పై అతి తక్కువ ఖర్చు చేసినట్లు పార్లమెంట్‌ సాక్షిగా వివరాలు వెల్లడయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7లక్షల 29వేలు ఖర్చు చేశారు. 106 కోట్లతో సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఏర్పాటుపై ప్రకటన చేయగా జోన్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌ గుర్తించామన్నారు . ఏపీలో సౌత్ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఏర్పాటుపై రాజ్యసభలో ఎంపీల ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. భూసర్వే, హెడ్‌ క్వార్టర్స్‌ కాంప్లెక్స్‌ లేఅవుట్‌, నివాస కాలనీ సహా నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాలని రైల్వేశాఖను కోరామని వెల్లడించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా ఇప్పటికే కమిటీ సమర్పించిందని స్పష్టం చేశారు.

Tags

Next Story