తస్మాత్ జాగ్రత్త.. అక్కడ ఉమ్మితే రూ. 500 ఫైన్..!

తస్మాత్ జాగ్రత్త.. అక్కడ ఉమ్మితే రూ. 500 ఫైన్..!
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తుంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులో నమోదు అవుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ప్రజల నిర్లక్ష్యమేనని చెప్పాలి.

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తుంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులో నమోదు అవుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ప్రజల నిర్లక్ష్యమేనని చెప్పాలి. మాస్క్‌‌లు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా... అసలు కరోనా అనేది లేదన్నట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మాస్క్ పెట్టుకొని వారికి రూ. 1000 ఫైన్ వేస్తోంది. కాగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లల్లో, రైల్వే స్టేషన్‌‌‌లలో మాస్క్ లేకుండా కనిపించినా, ఉమ్మినా రూ. 500జరిమానా విధించాలని అధికారులను ఆదేశించింది.

మరో వైపు జ్వరం, దగ్గు, శ్వాసకొస సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు రైళ్లల్లో ప్రయాణించవద్దని సూచించింది.

Tags

Next Story