సరిహద్దుల్లో భారీగా మోహరించిన భారత బలగాలు

సరిహద్దుల్లో భారీగా మోహరించిన భారత బలగాలు
సరిహద్దుల్లో అన్ని విధాల భారత్ సన్నద్ధం అవుతుంది. భారత్ కి రాఫెల్ విమానాలు వచ్చినప్పటి నుంచి సరిహద్దులపై ప్రత్యేకంగా

సరిహద్దుల్లో అన్ని విధాల భారత్ సన్నద్ధం అవుతుంది. భారత్ కి రాఫెల్ విమానాలు వచ్చినప్పటి నుంచి సరిహద్దులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ల‌ఢక్‌లో అధునాత‌న రాఫెల్ యుద్ధ‌విమానా‌ల‌ను మోహ‌రించిన ఇండియ‌న్ ఆర్మీ.. తాజాగా నియంత్ర‌ణ రేఖ సమీపంలోకి భారీ యుద్ధ ట్యాంక్‌ల‌ను త‌ర‌లించింది. మైన‌స్ 40 డిగ్రీల సెల్సీఎస్ లో కూడా ప‌నిచేసే సామ‌ర్థ్య‌మున్న బీఎంపీ-2 వాహ‌నాల‌తోపాటు, అత్యంత శ‌క్తిమంత‌మైన టీ-90, టీ-72 యుద్ధ ట్యాంకుల‌ను మోహ‌రించింది.

భార‌త్‌-చైనా మ‌ధ్య ఈ ఏడాది ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ పరిస్థితులు తారా స్థాయికి చేరడంతో జూన్ నెల‌లో గ‌ల్వాన్ లోయ‌‌లో ఇరు దేశాల సైనికుల‌ మధ్య భీకర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరవీరులైయ్యారు. అయితే, అప్పటి నుంచి చైనా శాంతి చర్చలు జరపుతూనే మరోవైపు సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తుంది. దీనికి ప్రతిగా భారత్ కూడా యుద్ధ ట్యాంకులను సరిహద్దుల్లో సిద్ధం చేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story