దుబాయ్ ప్రభుత్వ ఔదార్యం.. తెలంగాణ వ్యక్తికి కోటి రూపాయలు..

దుబాయ్ ప్రభుత్వ ఔదార్యం.. తెలంగాణ వ్యక్తికి కోటి రూపాయలు..
అక్కడికి వెళ్లాక గానీ అతడికి తెలిసింది ఏజెంట్ తనని మోసం చేశాడని.. తిరిగి స్వదేశానికి వచ్చే దారిలేక అయిన వాళ్లకు దూరంగా..

ఏజెంట్ మాటలు నమ్మాడు.. దుబాయ్ వెళితే నీ కష్టాలు గట్టెక్కుతాయన్నాడు.. అతడి మాటలు నమ్మి పైసలు చేతిలో పెట్టి ఫ్లైట్ ఎక్కాడు తెలంగాణకు చెందిన 47 ఏళ్ల పోతుగొండ మేడీ.. అక్కడికి వెళ్లాక గానీ అతడికి తెలిసింది ఏజెంట్ తనని మోసం చేశాడని.. తిరిగి స్వదేశానికి వచ్చే దారిలేక అయిన వాళ్లకు దూరంగా అలాగే 13 ఏళ్లు గడిపేశాడు.. పొట్ట కూటి కోసం చిన్నా చితక పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు.. ఇంతలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి.. కంటి మీద కునుకు లేదు.. చేసేందుకు పనిలేదు.. లాక్టౌన్.. పోతుగొండకి పూట గడవడం కష్టంగా మారింది.

దీంతో అతడు దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాన్ని సంప్రదించాడు. తన సమస్యను వివరించి సాయం చేయమని అర్థించాడు. కాన్సులేట్ అధికారులు దుబాయ్ ప్రభుత్వంతో ఈ విషయమై చర్చించారు. సానుకూలంగా స్పందించిన యూఏఈ ప్రభుత్వం.. 13 ఏళ్లు అక్రమంగా దుబాయ్ లో నివసించినందుకుగాను పోతుగొండ మేడి కట్టాల్సిన కోటి రూపాయల జరిమానాను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. అతడిని స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేసింది. దాంతో పోతుగొండ 13 ఏళ్ల తరువాత ఇంటికి చేరుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story