దేశంలో కొవిడ్ సోకిన తొలివ్యక్తికి రీ-ఇన్‌ఫెక్షన్‌..!

దేశంలో కొవిడ్ సోకిన తొలివ్యక్తికి రీ-ఇన్‌ఫెక్షన్‌..!
భారత్‌లో కొవిడ్‌-19 సోకిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కిన మహిళకు మళ్లీ వైరస్‌ సోకింది.

Coronavirus: చైనాలో వెలుగు చూసిన కరోనా యావత్‌ ప్రపంచానికి విస్తరించింది. ఇక భారత్‌లో కొవిడ్‌-19 సోకిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కిన మహిళకు మళ్లీ వైరస్‌ సోకింది. గత ఏడాది కేరళకు చెందిన ఓ మహిళ దేశంలో తొలిసారి కరోనా సోకింది. ఇక తాజాగా ఆమె మరోసారి కొవిడ్ బారినపడినట్లు అధికారులు వెల్లడించారు. యాంటీజెన్‌ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చినప్పటికీ ఆర్‌టీ-పీసీఆర్‌లో మాత్రం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఈ అంశంపై కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కేజే రీనా స్పందించారు. ఆ మహిళ నమూనాలను పరీక్షించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. విదేశీ విద్యాకు వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆమె కరోనా టెస్టుకు వచ్చినట్లు రీనా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమెకు పరీక్ష చేయగా మరోసారి కొవిడ్ సోకినట్లు పరీక్షల్లో తేలిందని రీనా తెలిపారు.

దేశంలో మాత్రం జనవరి 30, 2020న తొలి కేసు నమోదయ్యింది. కేరళకు చెందిన మెడికల్‌ విద్యార్థిని వుహాన్‌ యూనివర్సిటీలో చదువుతోంది. సెమిస్టర్‌ సెలవుల్లో భాగంగా భారత్‌కు వచ్చింది. అనంతరం అస్వస్థతకు గురికావడంతో అధికారులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Tags

Next Story