దేశంలో మొదటి మహిళా కార్డియాలజిస్ట్ కొవిడ్ తో మృతి

దేశంలో మొదటి మహిళా కార్డియాలజిస్ట్ కొవిడ్ తో మృతి
"గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ" గా ప్రసిద్ది చెందిన పద్మావతి భారతదేశపు మొదటి మహిళా కార్డియాలజిస్ట్. కోవిడ్ కారణంగా ఆమె మృతి

"గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ" గా ప్రసిద్ది చెందిన పద్మావతి భారతదేశపు మొదటి మహిళా కార్డియాలజిస్ట్. కోవిడ్ కారణంగా ఆమె మృతి చెందారు. డాక్టర్ ఎస్ పద్మావతి (103) మరణించినట్లు నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆదివారం తెలిపింది. ఆమె గత 11 రోజులుగా ఎన్‌హెచ్‌ఐలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. పద్మావతి 1917 లో బర్మా (ఇప్పుడు మయన్మార్) లో జన్మించారు. 1942 లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె కుటుంబం భారతదేశానికి వలస వచ్చింది. రంగూన్ మెడికల్ కాలేజీ నుండి పట్టభద్రురాలైన పద్మావతి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు.

విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేరారు. 1962 లో, డాక్టర్ పద్మావతి ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్‌ను స్థాపించారు. 1981 లో నేషనల్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌ను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ ఇనిస్టిట్యూట్ ఆధునిక గుండె ఆసుపత్రిగా ప్రసిద్ధిపొందింది. ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి కార్డియాక్ కాథెటరైజేషన్ ప్రయోగశాలతో NHI ముందుంది. భారతదేశంలో కార్డియాలజీ అభివృద్ధికి ఆమె సాధించిన విజయాలతో పాటు ఆమె కృషికి అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అండ్ ఫామ్స్ 1967 లో పద్మ భూషణ్, 1992 లో పద్మ విభూషణ్ భారత ప్రభుత్వ ఫెలోషిప్ అందుకున్నారు.

Tags

Next Story