ఇండోనేషియాలో విమానం అదృశ్యం!

ఇండోనేషియాలో విమానం అదృశ్యం!
జకార్తా నుంచి బయల్దేరిన ఎయిర్‌ బోయింగ్‌ 737 శ్రీవిజయ విమానం టేకాఫ్‌ అయిన నాలుగు నిమిషాలకే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.

ఇండోనేషియాలోని జకార్తా నుంచి పాంటియానక్‌ వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం అదృశ్యమైంది. జకార్తా నుంచి బయల్దేరిన ఎయిర్‌ బోయింగ్‌ 737 శ్రీవిజయ విమానం టేకాఫ్‌ అయిన నాలుగు నిమిషాలకే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 59మంది ఉన్నట్టు సమాచారం. వీరిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఓ ద్వీపంలో విమానం కూలిపోయి ఉంటుందని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే రాడార్ సమాచారాన్ని అధికారులు విశ్లేశిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు.

Tags

Next Story