Infosys Founder: రాజధాని పౌరుల్లో క్రమశిక్షణా రాహిత్యం: ఇన్ఫోసిస్ ఫౌండర్

Infosys Founder: రాజధాని పౌరుల్లో క్రమశిక్షణా రాహిత్యం: ఇన్ఫోసిస్ ఫౌండర్
Infosys Founder: క్రమశిక్షణకు మారు పేరు ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి. ఢిల్లీకి రావడం తనకు అసౌకర్యంగా ఉందని,

Infosys Founder: క్రమశిక్షణకు మారు పేరు ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి. ఢిల్లీకి రావడం తనకు అసౌకర్యంగా ఉందని, ఎందుకంటే "క్రమశిక్షణా రాహిత్యం అత్యధికంగా ఉన్న నగరం ఇది" అని అన్నారు. ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) వ్యవస్థాపక దినోత్సవంలో మూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనలో నిజాయితీ లేని సమస్యలను నివారించడానికి ప్రజలు వ్యక్తిగత ఆస్తి కంటే సమాజ ఆస్తిని విలువలలో ఒకటిగా పరిగణించాలని అన్నారు. "ఢిల్లీకి రావడం నాకు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది, క్రమశిక్షణా రాహిత్యం ఎక్కువగా ఉన్న నగరం ఇది. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. నేను నిన్న విమానాశ్రయం నుండి వచ్చాను. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చాలా కార్లు, మోటర్‌బైక్‌లు, స్కూటర్లు నడిపే వారు నిబంధనలు ఉల్లంఘించి రాజధాని పౌరుల బాధ్యతారాహిత్యాన్ని గుర్తు చేస్తున్నారు.

ఒకట్రెండు నిముషాలు కూడా వెయిట్ చేయలేక పోతే ఎలా. చిన్న వయసు నుంచే సరైన మార్గాన్ని అనుసరించడం అలవాటు చేసుకోవాలి. మన పిల్లలకు ఈ విషయాలను నేర్పడం ప్రారంభించాలి... అప్పుడే వారి ఆలోచనలు క్రమంగా మెరుగుపడతాయి. తాను తన గురువు నుండి కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించిన మొదటి పాఠాన్ని నేర్చుకున్నట్లు నారాయణమూర్తి చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story