తన విగ్రహం తయారు చేయమంటూ బాలు ఆఖరిసారి..

బాలసుబ్రమణ్యం నెల్లూరు జిల్లా సింహపురిలోని వేద పాఠశాలలో ప్రతిష్టించేందుకు తనది, తన తల్లి శకుంతలమ్మ విగ్రహాలు తయారు చేయమని కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డి రాజ్‌కుమార్ వడయార్‌కు పురమాయించారు.. ఇదే విషయమై ఆస్పత్రిలో చేరేముందు ఆగస్టు 1న ఆయనకు వాయిస్ సందేశం పంపారు బాలు.. నమస్కారం రాజ్‌కుమార్ గారు.. మీరు పంపిన నా తల్లిగారు, నా బొమ్మలను చూశాను. చాలా బాగా వచ్చాయి. వాటిలో లోపాలు ఏమీ లేవు. నా తల్లిగారి విగ్రహం నెల్లూరులోని వేద పాఠశాలలో ప్రతిష్టించాలనుకుంటున్నాను.. పంపించే ఏర్పాటు చేయండి అని శిల్పి రాజ్‌కుమార్‌కు సందేశం పంపించారు.
ఆయనే ఇంతకు ముందు బాలు తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని తయారు చేశారు. ఆ విగ్రహాన్ని వేద పాఠశాలలో ప్రతిష్టింపజేశారు. తర్వాత తన తల్లి విగ్రహాన్ని, తన విగ్రహాన్ని తయారు చేయమని వడయార్‌కు బాలు ఆర్డరిచ్చారు. ప్రస్తుతం ఆ రెండు విగ్రహాలు తన వద్దనే ఉన్నాయని చెబుతూ.. రాజ్‌కుమార్ బాలు మరణ వార్త విని కన్నీరుమున్నీరయ్యారు. బాలు విగ్రహం తయారు చేసిపెట్టమంటూ అభిమానుల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com