ఏడుకొండల వాడి ఆలయంలో ఎవరికీ తెలియని రహస్యాలు ఎన్నో..

ఏడుకొండల వాడి ఆలయంలో ఎవరికీ తెలియని రహస్యాలు ఎన్నో..
ఏడాదికి ఒక్కసారైనా ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోకపోతే ఏవైనా ఆటంకాలు ఎదురవుతాయేమోనని శ్రీవారిని అమితంగా ఆరాధించే భక్తులు..

ఏడాదికి ఒక్కసారైనా ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోకపోతే ఏవైనా ఆటంకాలు ఎదురవుతాయేమోనని శ్రీవారిని అమితంగా ఆరాధించే భక్తులు తలస్తుంటారు. ఎన్ని అవరోధాలైనా ఇట్టే సమసి పోతాయని ఆ తిరుమలేశునికి మొక్కుకుంటారు. భక్తులు పెద్ద మొత్తంలో శ్రీవారికి కానుకలు సమర్పిస్తుంటారు. అధిక మొత్తంలో ఆదాయంతో పాటు, ఆధ్యాత్మికతను సంతరించుకున్న ప్రదేశం తిరుమల తిరుపతి దేవస్థానం. ఇంతటి ప్రాముఖ్యతను సొంతం చేసుకున్న తిరుమలేశుని గురించి భక్తులకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి.. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. స్వామి వారికి నిత్య పూజల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న వంటి తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు. అక్కడ నివసించే వారికి తప్ప ఆ గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవడం విశేషం. ఎంతో నియమ నిష్టలతో పూజకు అవసరమయ్యే సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకువెళుతుంటారు గ్రామస్తులు.

2. శ్రీవారి విగ్రహం గర్భగుడిలో ఉండదు.. భక్తులకు మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఈవిషయమం స్పష్టమవుతుంది.

3. స్వామివారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుంది. దీనివెనుక ఓ ఆసక్తికరమైన కథనం కూడా ప్రచారంలో ఉంది. వేంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులోని కొంతభాగాన్ని కోల్పోతారు. అది గమనించిన నీల వేది అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది. ఆమె భక్తికి మెచ్చిన స్వామి ఎదరైతే తనను దర్శించుకునేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తారు. అప్పటి నుంచి భక్తులు తిరుమల శ్రీవారికి తల నీలాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది.

4. స్వామి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. ఈ ఘోష వినే అదృష్టం ఆలయ అర్చకులకు తప్ప సామాన్య భక్తులకు లేదు.

5. గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలను ఎవరు, ఎప్పుడు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియవు.

6. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. పూజారులు విగ్రహాన్ని పొడిగా ఉంచేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

7. స్వామి వారికి ఉపయోగించిన పువ్వులను గర్భగుడిలో స్వామి వారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలో వెనక్కి చూడకుండా వేస్తారు. ఆశ్చర్యకంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (శ్రీకాళహస్తికి వెళ్లే దారి)లో కనిపిస్తాయి.

8. ఏదైనా రాతికి ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరం పూస్తే విచ్చిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్నా ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది.

9. తిరుమల సముద్ర మట్టానికి 3వేల అడుగుల ఎత్తులో ఉండడం వలన పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. కానీ శ్రీవారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల వేడితో, చెమటలు పట్టినట్లు ఉంటుంది. అర్చకులు వాటిని పట్టువస్త్రాలతో తుడుస్తుంటారు. పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు.

Tags

Next Story