ఐపీఎల్ 2020 షెడ్యూల్ వచ్చేసిందోచ్..

ఐపీఎల్ 2020 షెడ్యూల్ వచ్చేసిందోచ్..
కరోనా వలన ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందా? లేదా? అనే చర్చ తీవ్రంగా జరిగింది. అయితే, యూఏఈలో ఐపీఎల్ జరుగుతుందని ప్రకటించడంతో

కరోనా వలన ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందా? లేదా? అనే చర్చ తీవ్రంగా జరిగింది. అయితే, యూఏఈలో ఐపీఎల్ జరుగుతుందని ప్రకటించడంతో అన్ని జట్లు ఇప్పటికే అక్కడకు చేరుకున్నాయి. కానీ, క్రికెట్ అభిమానులు మాత్రం ఈ సీజన్ షెడ్యూల్ ఎప్పుడు విడుదల అవుతుందో అని కంట్లో ఒత్తులు వేసుకొని చేస్తున్నారు. మొత్తానికి ఎట్టకేలకు ఐపీఎల్ 2020 షెడ్యూల్ కూడా విడుదలైంది. మొదటి మ్యాచ్చే.. మంచి ఉత్కంఠగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19న అబుదాబిలో జరిగే మొదటి మ్యాచ్ రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్, ధోని సారధ్యంలో చైన్సై సూపర్ కింగ్స్ రణరంగంలోకి దిగనున్నాయి. రెండో మ్యాచ్ 20న దుబాయ్‌లో ఢిల్లీ కేపిటల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు 21 యుద్దానికి దిగనుండగా.. రాజస్థాన్ రాయల్స్ తో సీఎస్‌‌కే 22న తలపడనుంది. తరువాత నవంబర్ 7న క్వాలిఫయర్-1 మ్యాచ్, నవంబరు 8న ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబరు 9న క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుండగా, 10న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ లు మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

Tags

Next Story