జాతీయం

రూ.5,000లతో IRCTC అదిరిపోయే ప్యాకేజ్..

ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ సూపర్ ట్రావెల్ ప్యాకేజీని ఆవిష్కరించింది. జగన్నాథ యాత్రను మీ ముందుకు తీసుకు వచ్చింది.

రూ.5,000లతో IRCTC అదిరిపోయే ప్యాకేజ్..
X

పూరీ జగన్నాథుడిని సందర్శించుకోవాలని పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నారా.. ఎప్పటికి వీలవుతుందో అని వాపోతున్నారా.. మరైతే మీ కోసమే ఈ ప్యాకేజీ.. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ సూపర్ ట్రావెల్ ప్యాకేజీని ఆవిష్కరించింది. జగన్నాథ యాత్రను మీ ముందుకు తీసుకు వచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా పూరీ, భువనేశ్వర్, కోణార్క్ ప్రాంతాలను సందర్శించి రావొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. టూర్‌కు వెళ్లాలని భావించే వారు సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ ప్రాంతాల్లో రైలెక్కొచ్చు. అలాగూ టూర్ ముగించుకుని వచ్చేటప్పుడు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్‌లలో ఎక్కడైనా ట్రైన్ దిగొచ్చు.

మార్చి 5న ప్రారంభమయ్యే ఈ టూర్ 5 రోజులు ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి అర్ధరాత్రి 12.05 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. టూర్ ప్యాకేజీ ధర రూ.5,250. 5 ఏళ్లలోపు పిల్లలుంటే ఎలాంటి చార్జీలు ఉండవు. అయితే ఇది స్లీపర్ క్లాస్ టికెట్. అదే 3టైర్ ఏసీలో ప్రయాణించాలనుకుంటే రూ.6,300 చెల్లించాలి. ఇకపోతే ఫుడ్డు, వసతి అన్నీ రైలు అధికారులే చూసుకుంటారు. కాబట్టి వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదు. మార్చి 5న బయల్లేరితే మళ్లీ మార్చి 9 కల్లా మీ ఊరిలో ఉంటారు. టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ ద్వారా చేసుకోవచ్చు. https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SCZBD34

Next Story

RELATED STORIES