Hyderabad to Karnataka: IRCTC 6 రోజుల టూర్ ప్యాకేజీ.. కాఫీ విత్ కర్ణాటకలో కూర్గ్ అందాలు..
Hyderabad to Karnataka: ఈ టూర్ ప్యాకేజీ కూర్గ్‌తో పాటు మంగళూరును కవర్ చేస్తుంది. ఐదు రోజుల పాటు కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకునే వారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది.

Hyderabad to Karnataka: కూర్గ్ దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ కొండ పట్టణాన్ని మడికేరి అని కూడా అంటారు. పశ్చిమ కనుమల్లో ఉన్న కొండ ప్రాంతం కూర్గ్. దీని చుట్టూ అనేక సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. IRCTC టూరిజం హైదరాబాద్ నుండి కూర్గ్ వరకు టూర్ ప్యాకేజీని అందిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీని కాఫీ విత్ కర్ణాటక పేరుతో అందిస్తున్నారు.
ఇది 6 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీ ప్రతి మంగళవారం హైదరాబాద్ నుండి అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ కూర్గ్‌తో పాటు మంగళూరును కవర్ చేస్తుంది. ఐదు రోజుల పాటు కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకునే వారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు..
IRCTC టూరిజం కాఫీ విత్ కర్ణాటక టూర్ ప్యాకేజీని బుక్ చేసుకున్న పర్యాటకులు మొదటి రోజు ఉదయం 06:05 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కాచిగూడ-మంగుళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. రోజంతా రైలు ప్రయాణం ఉంటుంది.
రైలు రెండో రోజు ఉదయం 9.30 గంటలకు మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. హోటల్‌లో రిఫ్రెష్ అయిన తర్వాత మంగళూరు లోకల్ సైట్ సీయింగ్. పిలికుల నేచర్ శాంక్చురీ, మంగళాదేవి టెంపుల్, కటీల్ టెంపుల్, తన్నీర్బావి బీచ్ సందర్శన. రాత్రి బస మంగుళూరులో ఉంటుంది.
మూడో రోజు ఉదయం కూర్గ్‌కి బయలుదేరుతారు. కూర్గ్ చేరుకున్న తర్వాత ఓంకారేశ్వర దేవాలయం, అక్కడి నుంచి అబ్బే జలపాతం అందాలు తిలకించడం. కూర్గ్‌లో రాత్రిపూట బస ఉంటుంది.
నాల్గవ రోజు ఉదయం కావేరీ అభయారణ్య సందర్శన. మధ్యాహ్నం మడికేరి కోట, రాజాస్ సీటు చూడవచ్చు. కూర్గ్‌లో రాత్రి బస.
ఐదవ రోజు ఉదయం హోటల్ నుండి చెక్అవుట్ తర్వాత తలకావేరి, భాగమండల సందర్శన ఉంటుంది. ఆ తర్వాత మంగుళూరు బయలుదేరాలి. మంగళూరు సెంట్రల్ నుంచి రాత్రి 8.05 గంటలకు బయలుదేరి ఆరో రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
IRCTC టూరిజం కాఫీ విత్ కర్ణాటక టూర్ ప్యాకేజీ స్టాండర్డ్ ప్యాకేజీ ధరలు ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 9,230,
డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 11,570
సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 20,780.
కంఫర్ట్ ప్యాకేజీ ధరలు ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.12,230,
డబుల్ ఆక్యుపెన్సీకి రూ.14,570
సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.23,780.
స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ట్రావెల్, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ ట్రావెల్, ఏసీ వెహికల్‌లో సైట్ సీయింగ్, హోటల్ వసతి, అల్పాహారం, ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ ఉన్నాయి. లంచ్, డిన్నర్, స్నాక్స్ వంటి వన్నీ సొంత ఖర్చులే. వీటిని IRCTC కవర్ చేయదు.
రైలులో ఆహారం కూడా ప్రయాణీకులు వారి స్వంత ఖర్చులతో కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణీకులు తప్పనిసరిగా సందర్శనా స్థలాలలో ప్రవేశ టిక్కెట్లను కూడా వారే తీసుకోవాలి.
RELATED STORIES
Bhimavaram: అల్లూరి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి.. 27 మందికి...
3 July 2022 3:55 PM GMTChandrababu: సీఐడీపై డీజీపీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. వీడియోలను...
3 July 2022 9:15 AM GMTPawan Kalyan: నా సిద్దాంతాల ఆధారంగానే పార్టీ ముందుకు వెళుతుంది- పవన్...
2 July 2022 2:21 PM GMTYCP: వైసీపీ ప్లీనరీలో మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఖంగుతిన్న పార్టీ...
1 July 2022 3:45 PM GMTChandrababu: ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు ఉంటే రాజీనామా చేసి...
1 July 2022 3:05 PM GMTAP Movie Tickets: ఆన్లైన్లో సినిమా టికెట్ల అమ్మకంపై ఏపీ హైకోర్టు...
1 July 2022 1:23 PM GMT