ISRO : మరో భారీ రాకెట్ ప్రయోగానికి ఇస్రో రెడీ

ఇస్రో మరో భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఇవాళ షార్ నుండి ఎల్వీఎం–3 రాకెట్ ను ప్రయోగించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ రాకెట్ ద్వారా మొత్తం 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది ఇస్రో. ఇవన్నీ బ్రిటన్‌కు చెందిన వెబ్ ఇంటర్నెట్ సంస్థకు చెందిన ఉగ్రహాలు. మొత్తం 72 శాటిలైట్లను ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టడానికి ఇస్రోతో ఒప్పందం కుదుర్చకుంది వన్ వెబ్ సంస్థ. తొలి విడతలో 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తాజాగా మరో 36 ఉపగ్రహాలను ఎల్‌వీఎం-3 రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు. 5వేల 805 కిలోల బరువు కలిగి ఉన్న 36 ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల. ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపనున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం గతంలో రష్యా సహాయాన్ని కోరింది వన్ వెబ్ సంస్థ. రష్యా ఉక్రెయిన్ మద్య యుద్ధం కొనసాగుతుండటంతో.. రష్యా అంతరిక్ష కార్యకలపాలు, సోయిజ్ రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేసింది. దీంతో ఇస్రో సహకారాన్ని తీసుకుంటోంది. గ్లోబల్ బ్రాడ్ బ్యాండ్ కవరేజీని మరింత మెరగుపర్చడానికి మొత్తం 588 ఉపగ్రహాలు ప్రారంభించాలని వన్ వెబ్ సంస్థ తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com