IT Companies: అదృష్టం అంటే ఐటీ ఉద్యోగులదే.. ఏకంగా 70 నుంచి 120 శాతం దాకా..

IT Companies: అదృష్టం అంటే ఐటీ ఉద్యోగులదే.. ఏకంగా 70 నుంచి 120 శాతం దాకా..
IT Companies: కరోనా వచ్చి ఐటీ ఉద్యోగులందరినీ ఇంటికే పరిమితం చేసింది. ఇప్పుడు ఆఫీస్‌కి రమ్మంటే ససేమిరా రామంటున్నారు..

IT Companies: కరోనా వచ్చి ఐటీ ఉద్యోగులందరినీ ఇంటికే పరిమితం చేసింది. ఇప్పుడు ఆఫీస్‌కి రమ్మంటే ససేమిరా రామంటున్నారు.. అదేమంటే రిజైన్ చేయడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. దీంతో ఉద్యోగులను నిలుపుకునేందుకు కంపెనీలు నానా తంటాలు పడుతున్నాయి. అస్త్రాలెన్నో ప్రయోగిస్తున్నాయి. అందులో భాగంగానే భారీ స్థాయిలో జీతాలు కూడా పెంచుతున్నాయి. ఈసారి ఏకంగా 70 నుంచి 120 శాతం దాకా ఉద్యోగులకు జీతాలను పెంచేందుకు నిర్ణయించాయి.

ఇప్పటికే చాలా కంపెనీలు జాయినిగ్ బోనస్‌ని కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లాంటి దిగ్గజాలతో పాటు ఇతర టాప్ కంపెనీలు కూడా ఉన్నాయి.

జీతాల పెంపుతో పాటు, బెస్ట్ ఉద్యోగులకు మేనేజ్‌మెంట్ స్థాయి ప్రమోషన్లు కూడా ఉంటాయని విప్రో పేర్కొంది.

ఇన్ఫోసిస్‌ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కూడా అట్రిషన్ రేటు ఎక్కువగా ఉండడంతో కంపెనీ లాభాలపై స్వల్సకాలిక ప్రభావం చూపుతోంది. జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో అట్రిషన్ రేటు 27.7 శాతం నుంచి 28.4 శాతానికి పెరిగింది. దీనిని గణనీయంగా తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది.

దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌లో అట్రిషన్ రేటు 19.7 శాతం ఉంది. దీన్ని తగ్గించుకునేందుకు 5 నుంచి 8 శాతం వేతనాలు పెంపు ఆఫర్ చేస్తున్నామని హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ప్రకటించారు. మంచి నైపుణ్యం కనబరిచిన వారికి వేతన పెంపు ఉంటుందని పేర్కొన్నారు. మరికొన్ని దిగ్గజ ఐటీ కంపెనీల్లోనూ ఇదే మాదిరిగా వేతన పెంపుతో పాటు ఉద్యోగులను ఆకర్షించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి కంపెనీలు.

Tags

Read MoreRead Less
Next Story