Shweta Gaonkar: శ్వేత గోయంకర్ కొబ్బరి కల్లు వ్యాపారం.. లక్షల్లో ఆదాయం

Shweta Gaonkar: శ్వేత గోయంకర్ కొబ్బరి కల్లు వ్యాపారం.. లక్షల్లో ఆదాయం
Shweta Gaonkar: అబ్బాయిల్లా ఆ చెట్లు ఎక్కడం ఏంటి.. అని ఇంట్లో వాళ్లు కట్టడి చేసి ఉంటే ఈ రోజు ఆమెకు ఇంత పేరు వచ్చి ఉండేది కాదు..

Shweta Gaonkar: అబ్బాయిల్లా ఆ చెట్లు ఎక్కడం ఏంటి.. అని ఇంట్లో వాళ్లు కట్టడి చేసి ఉంటే ఈ రోజు ఆమెకు ఇంత పేరు వచ్చి ఉండేది కాదు.. అయినా అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా ఎందుకు.. 24 ఏళ్ల శ్వేత గోయంకర్ ఇప్పుడు గోవాలో ఏకైక కొబ్బరి కల్లు గీత కార్మికురాలిగా పేరు సంపాదించుకుంది.

గోవా బీచ్‌లకు ఎంత ప్రసిద్దో అలాగే కొబ్బరి చెట్లు కూడా అక్కడ ఎక్కువగా ఉంటాయి. లక్షలాది కొబ్బరి చెట్లు ఉన్న కొబ్బరి కల్లు గీసే కార్మికులు మాత్రం 200కు మించి లేరు. అయితే కొబ్బరి కల్లు ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పింది శ్వేత.. దాంతో ఇప్పుడు అందరూ దాన్ని ఒక లాభసాటి వ్యాపారంగా చూస్తున్నారు. ఒక కొబ్బరి ఫామ్‌కు మేనేజర్‌గా పని చేస్తోంది. కొబ్బరి చెట్లకు కల్లు గీయడం ఎలాగో నేర్పిస్తూ శ్వేత కొన్ని వందల జీవితాల్లో వెలుగులు పంచుతోంది. ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తోంది.

ఇంజనీరింగ్ చదివి మంచి సాప్ట్‌వేర్ ఉద్యోగం చేద్దామనుకుంది. కానీ వ్యవసాయం మీద మక్కువతో బీఏ అగ్రికల్చర్ చేసి బెంగళూరులోని ఒక సంస్థలో ఉద్యోగానికి వెళ్లింది. అక్కడ టిష్యూ కల్చర్ గురించి పరిశోధన చేస్తుంటే లాక్‌డౌన్ వచ్చి ఉద్యోగం పోయింది. దాంతో గోవాకు తిరిగి వచ్చి ఒక కొబ్బరి తోటలో మేనేజర్‌గా జాయినైంది.

తోట వ్యవహారాలు చూస్తున్న శ్వేతకు ఒకరోజు కొబ్బరి చెట్టు ఎక్కాలనిపించింది. అలాగే భయం లేకుండా పై వరకు ఎక్కేసింది. కొబ్బరి కల్లు తీస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. మరుసటి రోజు నుంచే ఆ పని మొదలెట్టింది.

తాను పని చేస్తున్న కొబ్బరి తోటలోని చెట్ల నుంచి కల్లు గీయడం ప్రారంభించేసరికి అది తెలిసి చుట్టుపక్కల వారు చూడడానికి రావడం మొదలుపెట్టారు. తాటి కల్లు మాదిరిగానే ఈత కల్లు కూడా దేశీయ పానీయం. అందుబాటులో లేక చాలా తక్కువ మందికి కొబ్బరి కల్లు గురించి తెలుసు. కానీ శ్వేత వచ్చిన తరువాత అందరికీ కొబ్బరి కల్లు గురించిన కుతూహలం పెరిగింది.

కొబ్బరి చెట్లు ఎక్కడంలో రిస్క్ ఉంటుందని కల్లు గీయడంలో వెనుకడుగు వేస్తుంటారు చాలా మంది. అయితే కేరళ నుంచి తెప్పించిన పరికరంతో సులభంగా చెట్టు ఎక్కి కాయను దించడమే కాదు.. కల్లు ఎలా గీయవచ్చో నేర్పిస్తుంది శ్వేత. ఇటీవల ఆమె 60 మంది కొబ్బరి రైతులకు కల్లు గీయడం నేర్పించింది. ఈ సంఖ్య మరింత పెరగాలని కోరుకుంటోంది శ్వేత. అప్పుడే తన ప్రయత్నం ఫలిస్తుందని అంటోంది.

Tags

Read MoreRead Less
Next Story