Jammu : జమ్మూ కశ్మీర్ లో భారీ మందుగుండు సామగ్రి స్వాధీనం

Jammu : జమ్మూ కశ్మీర్ లో భారీ మందుగుండు సామగ్రి స్వాధీనం

జమ్మూ కశ్మీర్ లో రహస్య స్థావరాన్ని కనుగొన్నాయి భద్రతా బలగాలు. కుప్వారాలోని ఓ రహస్య స్ధావరం బయటపడింది. ఉత్తర కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలు, పోలీసుల సంయుక్త బృందం నిర్వహించిన సెర్చ్ లో తీవ్రవాదులు దాచి ఉంచిన మందుగుండు సామాగ్రి బయటపడింది. ఆయుధాలు, మారక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి ఆర్మీ దళాలు సెర్చ్ జరుపుతుండగా హెరాయిన్, రెండు పిస్టల్స్, ఒక ఐఇడీని స్వాధీనం చేసుకున్నారు.

పాల్నర్ హంగ్నికూట్ లోని హంద్వారా పోలీసులు శనివారం సోదాలు నిర్వహించారు. సెర్చ్ ఆపరేషన్ లో రెండు మ్యగజైన్ లు, 75 రౌండ్ లతో కూడిన ఏకే 47 రైఫిల్స్ తో సహా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, 10 గ్రెనేడ్లు, 26 యూజీబీఎల్ గ్రెనేడ్లు, ఎనిమిది యూజీబీఎల్ బూస్టర్లు, రెండు ఫ్లేమ్ త్రోయర్లు ఐదు రాకెట్ షెల్స్, మూడు రాకెట్ బూస్టర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ లోని సంబంధిత సెక్షన్ల కింద విల్గామ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story