Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్

Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్
X
Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. షోపియాన్‌ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. షోపియాన్‌ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌లోని ఓ ఇంట్లో టెర్రరిస్ట్‌లు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్‌ చేపట్టాయి.


ఉగ్రవాదులను లొంగిపోవాలంటూ హెచ్చరించినా వినకుండా భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.మృతిచెందిన వారిలో ఇద్దరు ఉగ్రవాదులు లతీఫ్‌ లోన్‌ ఏరియాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.


మరో ఉగ్రవాది ఉమర్‌ నజీర్‌ అనంతనాగ్‌ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు కశ్మీర్‌ అడిషనల్‌ డీజీపీ తెలిపారు. వీరంతా లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల నుంచి ఒక ఏకే 47 రైఫిల్‌, 2 పిస్తోల్‌లను స్వాధీనం చేసుకున్నారు. షోపియాన్‌లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని భద్రతా బలగాలు తెలిపాయి.

Tags

Next Story