Jammu & Kashmir: గుల్ మార్గ్ లో హిమపాతం... ఒకరి మృతి

జమ్ముకాశ్మీర్ లో ఒక్కసారిగా దూసుకువచ్చిన హిమపాతం ఒకరిని బలగొంది. గుల్ మార్గ్ లో చోటుచేసుకున్న ఈ ఘటనలో మరో ఇద్దరి ఆచూకీ గల్లంతైంది. రక్షణా చర్యలు చేపట్టిన పోలీసులు గల్లంతైన వారి కోసం వెతుకులాట ప్రారంభించారు. గుల్ మార్గ్ లోని అత్యంత ఎత్తనై ప్రాంతంల ో ఉన్న స్కీయింగ్ రిసార్ట్ పైకి హిమపాతం దూసుకురావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. గత శుక్రవారం కూడా కాశ్మీర్ లోని కిష్త్ వార్ జిల్లాలోని పథార్ ప్రాంతంలో ఓ హిమపాతం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనలో ఎవరి ప్రాణాలకూ హాని కలగలేదు. కొంతకాలం క్రితమే హిమపాతాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ హిమపాతం మేఛైల్ గ్రామాన్ని ఆనుకుని ఉన్న చెరువులోకి దూసుకుపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com