Jammu & Kashmir : మొదటిసారి భారత్ లో వెలుగు చూసిన లిథియం నిక్షేపాలు

Jammu & Kashmir : మొదటిసారి భారత్ లో వెలుగు చూసిన లిథియం నిక్షేపాలు
జమ్మూ కశ్మీర్ లో లిథియం లభిస్తుండటంతో రానున్న రోజుల్లో వాహనాల బ్యాటరీ ధరలు దిగిరానున్నాయి


భారత్ లో మొదటిసారి లిథియం నిక్షేపాలు వెలుగు చూశాయి. జమ్మూ కశ్మీర్ లోని రియాసి జిల్లాలో 59 లక్షల టన్నుల లిథియం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొబైల్ ఫోన్ లు, ల్యాప్ టాప్ లు, డిజిటల్ కెమెరాలు, ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలను తయారు చేసేందుకు లిథియం ఉపయోగపడుతుందని చెప్పారు. దీంతో పాటు.. గుండె పేస్ మేకర్ ల, బొమ్మలు, గడియారాలు, బ్యాటరీలలో కూడా ఉపయోగించవచ్చని తెలిపారు.


అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల కోసం కీలకమైన ఖనిజ సరఫరా గొలుసు బలోపేతం చేయడానికి, ఆస్ట్రేలియా, అర్జెంటీనా నుంచి లిథియంతో సహా ఖనిజాలను భద్రపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని గనుల మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ఖనిజాల కోసం భారత దేశం దిగుమతిపై ఆధారపడి ఉంది.జమ్మూ కశ్మీర్ లో లిథియం లభిస్తుండటంతో రానున్న రోజుల్లో వాహనాల బ్యాటరీ ధరలు దిగిరానున్నాయి. గనుల శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మాట్లాడుతూ.. స్వయం సమృద్ధి సాధించే దశలో విలువైన ఖనిజాలు కనుగొనడం, వాటిని ప్రాసెస్ చేయడం చాలా కీలకమని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story