Jammu Kashmir : బ్యాంకు గార్డును చంపిన ఉగ్రవాది హతం

Jammu Kashmir : బ్యాంకు గార్డును చంపిన ఉగ్రవాది హతం
X
పుల్వామాలోని పద్గం పోరా ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్న క్రమంలో కాల్పులు చోటుచేసుకున్నాయి


మంగళవారం తెల్లవారుజామున జమ్మూ కశ్మీర్ లోని అవంతిపురాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరణించిన వ్యక్తి కొద్దిరోజుల క్రితం బ్యాంకు గార్డును కాల్చి చంపినట్లుగా తెలిపింది భారత ఆర్మీ. పుల్వామాలోని పద్గం పోరా ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్న క్రమంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో అకిబ్ ముస్తాక్ అనే ఉగ్రవాది మరణించగా, ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.

అకిబ్ ముస్తాక్ మొదట ఉగ్రవాద సంస్థకోసం పనిచేశాడని తెలిపింది ఆర్మీ. కానీ ప్రస్తుతం టీఆర్ఎఫ్ (కశ్మీర్ మిలిటరీ) తో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ కాస్తా ఎన్ కౌంటర్ గా మారిందని తెలిపారు. మృతదేహాన్ని ఇంకా వెలికితీయలేదని భద్రతా బలగాలు చెప్పాయి. ఎన్ కౌంటర్ లో గాయపడిన ఇద్దరు జవాన్లు ఎన్ కే హేమ్ రాజ్, సిటి పవన్ అని తెలిపారు. వారు 92 బేస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ప్రకటించారు.

Tags

Next Story