17 Sep 2020 6:29 AM GMT

Home
 / 
జాతీయం / జయాబచ్చన్ రాజకీయాలు...

జయాబచ్చన్ రాజకీయాలు చేస్తున్నారు: జయప్రద

రవికిషన్ జీ చేసిన వ్యాఖ్యలకు నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. మాదకదవ్రాల వాడకానికి వ్యతిరేకంగా మనం గొంతు పెంచాలి..

జయాబచ్చన్ రాజకీయాలు చేస్తున్నారు: జయప్రద
X

సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం తరువాత బాలీవుడ్ లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అతడి మరణానికి డ్రగ్స్ ఒక కారణంగా కనిపించడంతో పరిశ్రమలోని కొద్ది మంది నటులు డ్రగ్స్ కు బానిస అవుతున్నారని, నిందితులపై చర్యలు తీసుకోవాలని భోజ్‌పురి నటుడు బీజేపీ ఎంపీ రవి కిషన్ పార్లమెంట్ లో ప్రస్తావించారు. అయితే రవి కిషన్ వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ తప్పుపట్టారు. అన్నం పెట్టిన చేతినే కొరుకుతున్నారని ఒక నటుడై ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కొంత మంది వ్యక్తుల కారణంగా పరిశ్రమ మొత్తాన్ని తప్పుపట్టడం మంచిదికాదన్నారు.. జయాబచ్చన్ వ్యాఖ్యలకు బాలీవుడ్ లో కొందరు నటులు మద్దతు పలికారు..

కాగా బీజీపీ నాయకురాలు జయప్రద జయాబచ్చన్ జీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని అన్నారు. రవికిషన్ జీ చేసిన వ్యాఖ్యలకు నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. మాదకదవ్రాల వాడకానికి వ్యతిరేకంగా మనం గొంతు పెంచాలి.. డ్రగ్స్ కు బానిసై చెడుదారి పడుతున్న యువతను కాపాడాలి. నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ వంటి పలు అంశాలనుంచి దృష్టి మళ్లించడానికే బచ్చన్ ఇలా చేస్తున్నారని జయప్రద వ్యాఖ్యానించారు. కాగా, బుధవారం జయ బచ్చన్ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యల తరువాత ముందు జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముంబై పోలీసులు జల్సాలోని బచ్చన్ నివాసానికి భద్రత కల్పించారు.

Next Story