Jayalalitha : మాజీ సీఎం జయలలిత నివాసంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

Jayalalitha : దివంగత తమిళనాడు సీఎం జయలలిత నివాసంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జయ నివాసాన్ని స్వాధీనం చేసుకోవాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రయత్నాలకు కోర్టు బ్రేకులు వేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జయ మేనళ్లుడు, మేనకొడలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు.. జయలలిత నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టంచేసింది. కోర్టు తీర్పుతో వేద నిలయం జయ మేనకోడలకే సొంతమైంది.
కాగా పోయస్ గార్డెన్‌లోని జయ నివాసం వేద నిలయాన్ని స్మారక చిహ్నంగా మార్చాలని గతంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ఇంటిని స్మారక చిహ్నంగా మార్చే బాధ్యత మరియు హక్కు పార్టీకి ఉందని, అది తమిళనాడు ప్రజలు మరియు ఏఐఏడీఎంకే పార్టీ కార్యకర్తల 'పూర్తి హృదయపూర్వక కోరిక' అని అన్నాడీఎంకే పేర్కొంది. అయితే దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ జయలలిత మేనకోడలు, మేనల్లుడు కోర్టును ఆశ్రయించారు.
తమని జయలలిత వారసులమని కోర్టు గుర్తించిందని.. అలాంటిది ఆమె నివాసాన్ని ఎలా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణ చేప్పట్టిన హైకోర్టు తుదితీర్పు నేడు వెల్లడించింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా అమ్మగా ఆరాధించే జయలలిత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2016 డిసెంబర్‌లో మరణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com