లోదుస్తులతో ఎమ్మెల్యే.. నెటిజన్లు ఫుల్ ట్రోలింగ్.. !

బిహార్ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్‌మండల్‌ను నెటిజన్లు ఇప్పుడు ఫుల్ ట్రోలింగ్ చేస్తున్నారు. దీనికి కారణం ఆయన లోదుస్తులు ధరించి రైలులో తిరగడమే. గురువారం తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఎమ్మెల్యే పాట్నా నుండి న్యూఢిల్లీ వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అసలు జరిగిన విషయం ఏంటంటే.. ఎమ్మెల్యే గోపాల్ మండల్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఏసీ బోగిలో ప్రయాణించారు. రైలు ఉత్తరప్రదేశ్‌లోని దిల్‌నగర్ స్టేషన్ దాటుతున్న సమయంలో ఆయన లోదుస్తులు(బనియన్,అండర్‌వేర్)తో వాష్‌రూమ్‌కు వెళ్లారు. అయితే అదే కంపార్ట్‌మెంట్‌లో బిహార్‌కు చెందిన ప్రహ్లద్ పాశ్వాన్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్నారు.
అక్కడ ఎమ్మెల్యే అవతారం చూసి కంగుతున్న ఆ వ్యక్తి గోపాల్ మండల్ వేషధారణ పైన అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో మండల్ ఆ వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. అంతేకాకుండా పలువురు ప్రయాణికులని సైతం ఆయన బెదిరించినట్టుగా సదరు వ్యక్తి ఆరోపించారు. ఈ నేపధ్యంలో ప్రయాణికులు ఆర్‌పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మండల్‌ని రైలులోని మరో కోచ్‌కు మార్చారు.
అయితే మండల్ తన చర్యలను సమర్ధించుకున్నారు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తన కడుపు నొప్పిగా ఉందని, అందుకే తాను లోదుస్తులు ధరించినట్టుగా పేర్కొన్నాడు. ఇది కాస్త వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆయనని ఫుల్ ట్రోలింగ్ చేస్తున్నారు. అండర్ వేర్‌లో తిరుగుతుంటే కడుపు నొప్పి తగ్గుతుందని తమకు తెలియదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com