Jharkhand: నర్స్‌గా తన విధులు నిర్వర్తించేందుకు నదిని దాటుతూ..

Jharkhand: నర్స్‌గా తన విధులు నిర్వర్తించేందుకు నదిని దాటుతూ..
అవసరం అన్నీ నేర్పిస్తుంది.. ఆటంకాల్ని, అవరోధాల్ని అధిగమించేలా చేస్తుంది. విధినిర్వహణలో భాగంగా చంటి బిడ్డను చంకన వేసుకుని నది

Jharkhand: అవసరం అన్నీ నేర్పిస్తుంది.. ఆటంకాల్ని, అవరోధాల్ని అధిగమించేలా చేస్తుంది. విధినిర్వహణలో భాగంగా చంటి బిడ్డను చంకన వేసుకుని నది ఆవలి గ్రామ ప్రజలకు వ్యాక్సినేషన్ అందిస్తూ అధికారుల ప్రశంసలు అందుకుంటోంది. కోవిడ్ మహమ్మారిని రూపు మాపడంలో తానూ భాగస్వామి అయినందుకు సంతోషిస్తోంది జార్ఖండ్‌కు చెందిన ఆరోగ్య కార్యకర్త మంతి దేవి.

భర్త నిరుద్యోగి.. ఉన్న ఒకే ఒక్క ఆధారం తన ఉద్యోగం. వెళ్లడం కష్టం అని ఇంట్లో కూర్చుంటే పూట గడవదు. ఆకలి బాధ గుర్తొస్తే అడవిలో రోజుకి 4-5 కిలోమీటర్లు ప్రయాణించడం తనకి సులభంగా అనిపిస్తుంది.

ప్రతి నెలా కొన్ని రోజులు మంతి దేవి జార్ఖండ్ అడవిలో కాలినడకన దాదాపు నడుము లోతున ఉన్న నదీ ప్రవాహాన్ని దాటాల్సి ఉంటుంది. ఇంటి దగ్గర చంటి బిడ్డను చూసుకునే వారు ఎవరూ లేకపోవడంతో ఆమె తన బిడ్డను వెనుక భాగంలో కట్టుకుని, ఒక చేత్తో చెప్పులు, భుజానికి బ్యాగు అందులో బాబుకి తినిపించాల్సిన ఆహారం, మరో చేతిలో గ్రామ ప్రజలకు వేసే వ్యాక్సిన్లు, ఔషధాల కిట్‌ని పట్టుకుని ముందుకు నడుస్తుంది. మంతి దేవి బుర్రా నదిలో వేగంగా ప్రవహించే నదిని దాటి గ్రామానికి చేరుకుంటుంది.

మంతి వారానికి ఆరు రోజులు, దట్టమైన అరణ్యాల గుండా ప్రతిరోజూ దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఆమె చేస్తున్న పని కారణంగా లాతేహర్ జిల్లాలోని మారుమూల అటవీ గ్రామాల ప్రజలు సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇక్కడ వైద్య చికిత్స పొందడం కష్టం. అందుకే ప్రభుత్వం కాంట్రాక్ట్ బేస్ మీద ఆరోగ్య కార్తలను నియమించి గ్రామ ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా చూస్తుంది.

అక్షీ పంచాయతీలో చిన్నపిల్లల కోసం ప్రభుత్వం రెగ్యులర్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సోహర్ పంచాయతీలోని కొన్ని కేంద్రాలలో కోవిడ్ టీకా డ్రైవ్ నిర్వహిస్తుంది. కాబట్టి, ఆమె ప్రతిరోజూ 25 కిలోమీటర్ల దూరంలో మహుదాన్ర్ బ్లాక్‌లోని తన ఇంటి నుండి చెట్మా ఆరోగ్య కేంద్రానికి ప్రయాణించవలసి ఉంటుంది. దీనికి ఆమె 10-12 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి నిరుద్యోగి అయిన భర్త సునీల్ ఒరాన్ ఆమెను ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తాడు. కాన్ని గ్రామాల్లో రవాణా మార్గం లేదు. అక్కడ కాలినడకనే వెళ్లి విధులు నిర్వహించాల్సి ఉంటుందని మంతి అన్నారు. రోజులో కనీసం 4-5 కిలోమీటర్లు అడవి మార్గంలో నడవాల్సి ఉంటుంది.

రెగ్యులర్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద, పిల్లలు మీజిల్స్, ఇన్ఫ్లుఎంజా, హెపటైటిస్, క్షయ వంటి వ్యాధుల నుండి రక్షించబడతారు. రక్తహీనత ఉన్న పిల్లలకు ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు మరియు యాంటీ-వార్మ్ ఔషధాల వంటి మందులను క్రమం తప్పకుండా పంపిణీ చేయాల్సి ఉంటుంది.

గత వారం, జార్ఖండ్ ప్రభుత్వం న్యుమోనియా వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది, దీని కింద పిల్లలకు న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్లు కూడా ఇవ్వబడుతున్నాయి. రెగ్యులర్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇటీవల అన్ని జిల్లా సివిల్ సర్జన్లను కోరింది. మహమ్మారి ఒక సవాలుగా మారడానికి ముందే జార్ఖండ్ ప్రభుత్వం సాధారణ రోగనిరోధకత కార్యక్రమాన్ని సజావుగా నిర్వహిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story