J&K: జమ్మూలో వరుస పేలుళ్లు..

జమ్మూలో శనివారం ఉదయం వరుస పేళుల్లు కలకలం సృష్టించాయి. నార్వాల్ ప్రాంతంలో 30 నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగాయని సమాచారం. ఈ ఘటనలో దాదాపు 9 మంది గాయపడ్డారని తెలుస్తోంది. మొదట జరిగిన పేలుళ్లలో ఐదుగురు గాయపడగా, మరో నలుగురు తరువాత జరిగిన పేలుడులో గాయపడ్డారు.
ఈ పేలుళ్లకు మహీంద్ర బొలేరో వాహనాన్ని వినియోగించినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని సుహైల్ ఇక్బాల్(35), సుషిల్ కుమార్(26), వైశవ్ ప్రతాప్(25), వినోద్ కుమార్(52), అరుణ్ కుమార్, అమిత్ కుమార్(40),రాజేష్ కుమార్(35) గా గుర్తించారు. ఉదాంపూర్ పేలుళ్లు ఈ పేలుళ్లు ఒకే విధంగా ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
దీనిపై స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇలాంటి హీనమైన చర్యలకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితులలో వదలొద్దని వారిని పట్టుకునేందుకు అన్ని విధాల ప్రయత్నించాలని భద్రతా బలగాలను ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com