J&K : మంచు దుప్పటి

జమ్మూ కశ్మీర్ మంచు దుప్పటి కప్పుకుంది. భారీగా మంచు కురుస్తుండటంతో శ్రీనగర్ సహా వివిధ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. మంచు వర్షంతో ఎటు చూసినా దట్టమైన మంచు పేరుకుపోయింది. తెల్లటి మంచుతో కొత్త అందాలు సంతరించుకుంది కశ్మీరం. చెట్లు, ఇళ్లు, వాహనాలు, రోడ్లు ఇలా అన్నింటినీ హిమం కప్పేసింది. పాల నురగల్లాంటి మంచు అందాలు పర్యాటకుల మనసును దోచేస్తున్నాయి.
పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది హిమ కశ్మీరం. ఇళ్లపై, చెట్లపై పడిన మంచుతో ఈ ప్రాంతమంత దవళ వర్ణంగా మారిపోయింది. అందమైన ప్రాంతాలు మరింత అందంగా ఆకట్టుకుంటున్నాయి. అటు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు రాహుల్‌గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర ముగింపులో భాగంగా శ్రీనగర్ చేరుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ అక్కడ వాతావరణాన్ని ఆస్వాధించారు. కురుస్తున్న మంచుకలో కాసేపు ఎంజాయ్ చేశారు. మంచు విసురుతూ కాసేపు ప్రియాంక గాంధీని ఆటపట్టించారు రాహుల్. ఆ వెంటనే ప్రియాంక గాంధీ కూడా తన అన్నపై మంచు విసురుతూ ఎంజాయ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com