J&K: జోషీ మఠ్ లానే... జమ్మూ కశ్మీర్ ఇళ్లలో పగుళ్లు

J&K: జోషీ మఠ్ లానే... జమ్మూ కశ్మీర్ ఇళ్లలో పగుళ్లు
జమ్మూ కాశ్మీర్ లో జోషీ మఠ్ రిపీట్ అవుతోందా?


జమ్మూకశ్మీర్ ఇళ్లలో పగుళ్లు ఏర్పడుతున్నాయి. దీంతో ఓ ఇళ్లు కూలిపోయింది. పలు ప్రాంతాల్లోని ఇళ్ళలో కూడా పగుళ్లు కనిపిస్తున్నాయి. ఈ పగుళ్లు జోషీ మఠ్ లో ఏర్పడిన విధంగానే ఉన్నాయి. జోషీ మఠ్ లో పగుళ్లు ఏర్పడగా ఆ ప్రాంతంలో నివసించే వారినందరినీ ప్రభుత్వం సురక్షిత ప్రాంతానికి తరలించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే పగుళ్లు ఎక్కువవడంతో ఇళ్లను కూల్చివేశారు. అదే మాదిరిగా.. ఇప్పుడు కశ్మీర్ లోని... పలు ఇళ్లకు కూడా పగుళ్లు ఏర్పడటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.


జమ్మూ కశ్మీర్ థాత్రి ప్రాంతంలోని నాయ్ బస్తీ గ్రామంలో... 19 నివాసాలు, ఒక మసీదు మరియు ఒక మతపరమైన విద్యాసంస్థతో సహా 21నిర్మాణాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. స్థానికులు ఇళ్లను కాలీచేసి వారి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. దోడా జిల్లాలో మొన్నటివరకు 6 భవనాలకు మాత్రమే పగుళ్లు ఉండగా... ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తుంది.

జమ్మూకశ్మీర్ ఢిప్యూటీ కమిషనర్, సీనియర్ సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేశామని, ఆహారం, విద్యుత్ తో సహా అవసరమైన అన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story