J&K: ఉగ్ర కలకలం; హిందువులే టార్గెట్... ఇళ్లలోకి జొరబడి కాల్పులు
Jammu & Kashmir

జమ్మూకాశ్మీర్, రాజౌరీ జిల్లాలోని డంగ్రీ గ్రామంలో ఉగ్ర కలకలం నలుగురిని బలితీసుకుంది. హిందువుల ఇళ్లలోకి జొరబడిన ఉగ్రవాదులు వారి ఆధార్ కార్డ్ ఆధారంగా హిందువులే అని ఖరారు చేసుకుని మరీ కాల్పులకు తెగబడ్డారు. ఇద్దరు మిలిటెంట్లు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
ఆదివారం తెల్లవారుఝామున 7గం.లకు అడవి మార్గం ద్వారా డంగ్రీ గ్రామంలోకి ప్రవేశించిన ఇద్దరు ఉగ్రవాదులు హిందూ ప్రభావిత ప్రాంతానికి వెళ్లి కాల్పులకు తెగబడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇళ్లలోకి చొరబడి, ఆధార్ కార్డ్ ఆధారంగా హిందువులే అని ఖరారు చేసుకుని మరీ ఒకొక్కరిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
సుమారు పది నిమిషాల పాటూ 25 మీటర్ల మేర విచక్షణా రహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిగాయి. తిరిగి అడివిలోకి వెళ్లే వరకూ అన్ని దిక్కుల్లోనూ ఉగ్రవాదులు తుపాకీలతో మోతెక్కించేశారు.
ఈ దాడిలో సుమారు 10 మంది పౌరులు గాయపడగా ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగానే ముగ్గురు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఇక కాల్పుల నేపథ్యంలో భయభ్రాంతులకు లోనైన రాజౌరీ వాసులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. మరోవైపు సున్నితమైన ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com