JNU : గర్భంలోనే సంస్కారాన్ని నేర్పించండి : RSS

గర్భిణీ స్త్రీలు స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్రను, రామాయణ, మహాభారత ఇతిహాసాలను చదవాలని అప్పుడే పుట్టబోయే పిల్లలు ధైర్యవంతులుగా సమాజ రక్షకులుగా మారతారని పేర్కొంది ఆరెఎస్ఎస్ అనుబంధ సంస్థ సంవర్ధిని న్యాస్. ఈ సంస్థ ఆర్ఎస్ఎస్ మహిళా విభాగమైన రాష్ట్ర సేవిక సమితికి చెందినది. 'గర్భాధారణ వేడుక' పేరుతో ప్రచారం ప్రారంభించారు. ఇందులో గర్భస్థ శిశువులకు ఆహ్లదకరమైన వాతావరణాన్ని ఇవ్వాలని, దాంతో పాటే భారతీయ సంస్కృతికి సంబంధించిన పాఠాలను తల్లులు వినాలని, చదవాలని అప్పుడే శిశువుకు ఉన్నతమైన జీవితం దిశగా అడుగులు పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమం ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో (JNU)లో జరిగింది. ఇందులో 70 - 80 మంది వైద్యులు పాల్గొన్నారు. వీరిలో ఎక్కువగా గైనకాలజిస్టులు, 12 వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆయుర్వేద వైద్యులు ఉన్నారు.
సంవర్ధిని న్యాస్ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాధురీ మరాఠే మాట్లాడుతూ.. "గర్భం నుంచే మనం విలువలను పెంపొందించుకోవాలి. పిల్లలకు దేశం గురించి బోధించడం ప్రధానం. అందుకు శివాజీ మహరాజ్ తల్లి జిజియాబాయి ఉదాహరణ. తల్లి అలవాట్లు, సంకల్పంలోంచే పిల్లలకు పాలనాశక్తి, ఉన్నతమైన లక్షణాలు ప్రాప్తిస్తాయి" అని అన్నారు.
ఎయిమ్స్ కు ఎన్ఎంఆర్ విభాగానికి చెందిన డాక్టర్ రమా జయసుందర్ మాట్లాడుతూ.. అసాధారణలతో పుట్టే శిశువుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. గర్భాధారణలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ.. ప్రతీ గర్భినీ ఆహ్లాదకరమైన వాతావరనంలో ఉండాలని, మంచి సంగీతాన్ని వినాలని అన్నారు.
ఈ ఈవెంట్ లో LGBTQ (lesbian, gay, bisexual, transgender, queer or questioning, intersex, asexual, and more) గురించి కూడా చర్చించారు. గర్భాధారణ సమయంలో పిల్లల లింగానికి సంబంధించిన అంచనాలను తల్లిదండ్రులు బలంగా ఏర్పరుకోవడం పలుమార్లు చర్చించుకోవడం వలన కూడా కొందరు స్వలింగ సంపర్కులుగా మారుతున్నారని చెప్పారు. డాక్టర్ శ్వేతా డాంగ్రే మాట్లాడుతూ తల్లికి ఒక కొడుకు ఉండి, రెండవ బిడ్డ ఆడపిల్ల కావాలి అని కోరుకున్నప్పుడు, మగబిడ్డ జన్మిస్తే. ఆ బిడ్డ స్వలింగ సంపర్కుడిగా మారే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com