Delhi : శ్రీరామనవమి రోజున చికెన్.. జేఎన్‌యూలో విద్యార్థి వర్గాల మధ్య ఘర్షణ

Delhi : ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రు యూనివర్శిటీ ఆదివారం మధ్యాహ్నం రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా హాస్టల్‌లో క్యాంటిన్‌లో చికెన్ వండడమే గొడవకు కారణమని తెలుస్తోంది. ఈ వ్యవహారం లెఫ్ట్ పార్టీ అనుబంధం JNU స్టూడెంట్ యూనియన్, RSS అనుబంధ విభాగం ABVP గొడవకు దారి తీసింది.కావేరి హాస్టల్‌లో జరిగిన ఈ గొడవలో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్యాంటిన్‌లో మాంసం పెట్టకుండా ABVP కార్యకర్తలు అడ్డుకున్నారని JNUSU విద్యార్థులు ఆరోపించారు. మెస్ సెక్రటరీపైనా ABVP కార్యకర్తలు దాడి చేశారని చెప్పారు. ఐతే వామపక్ష విద్యార్థి విభాగం సభ్యులు హాస్టల్‌లో పూజ నిర్వహించకుండా అడ్డుకున్నారని ABVP సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న సభ్యులు వెంటనే క్యాంపస్‌కు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com