JodoYatra: రేపటికి పూర్తి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తుది అంకానికి చేరుకుంది. రేపు ముగింపు సభ నిర్వహించనున్నారు. ఇవాళ శ్రీనగర్‌లోని పఠాన్‌చౌక్ నుంచి రాహుల్ యాత్ర చేపట్టారు. లాల్‌చౌక్ నుంచి నెహ్రూపార్క్ వద్ద ముగియనుంది. లాల్‌చౌక్‌లో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో రాహుల్ ఈ యాత్ర చేపట్టారు. దేశవ్యాప్తంగా 75 జిల్లాలను దాటుకుని శ్రీనగర్ చేరుకున్నారు. శ్రీనగర్‌లో యాత్ర సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ నేతలు పాల్గొన్నారు. రాహుల్ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రేపు భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో 12 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొననున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com