Ajay Mishra : మీడియాపై చేయి చేసుకున్న కేంద్రమంత్రి

కేంద్రమంత్రి అజయ్ మిశ్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. లఖింపూర్ ఖేరి కేసు విచారణపై ప్రశ్నించిన మీడియాపై ఆయన చేయి చేసుకున్నారు. దర్భాషలాడుతూ విలేకరులను నెట్టేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లఖింపూర్ హింసాత్మక ఘటన కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఇప్పటికే అరెస్టయ్యారు. కేసును విచారిస్తున్న సిట్ అధికారులు.. పక్కా ప్లాన్ ప్రకారమే కుట్ర జరిగిందని తేల్చారు. దీనిపై ప్రశ్నించినందుకే జర్నలిస్టులపై కేంద్రమంత్రి ప్రతాపం చూపారు. అజయ్ మిశ్ర తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
#WATCH | MoS Home Ajay Kumar Mishra 'Teni' hurls abuses at a journalist who asked a question related to charges against his son Ashish in the Lakhimpur Kheri violence case. pic.twitter.com/qaBPwZRqSK
— ANI UP (@ANINewsUP) December 15, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com