బాలీవుడ్ నటి బంగళా కూల్చివేత

బాలీవుడ్ నటి బంగళా కూల్చివేత
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తనకి నచ్చక పోతే ఏ మాత్రం ఆలోచించకుండా ఏకి పారేస్తుంది.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తనకి నచ్చక పోతే ఏ మాత్రం ఆలోచించకుండా ఏకి పారేస్తుంది. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది.. సుశాంత్ రాజ్ పుత్ మరణానికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. అధికారంలో ఉన్న శివసేన నేతృత్వంలొ నడుస్తున్న బృహన్మంబై నగర పాలక సంస్థ (బీఎంసీ) తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకు ఆవేదన చెందుతున్నారు. అక్రమ నిర్మాణం పేరుతో బాంద్రాలో ఉన్న తన బంగళాను కూల్చుతున్నారని ఆరోపించారు.

తాను శివసేనతో పోరాడుతున్నందువల్లే రాష్ట్ర ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని కంగన ఆరోపిస్తున్నారు. చట్టానికి విరుద్ధంగా తాను ఎటువంటి నిర్మాణం చేపట్టలేదని.. అయినా కోవడ్ సమయంలో కూల్చివేతలు సెప్టెంబర్ వరకు నిషేధించినా ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. రాష్ట్రంలో నియంతృత్వం కొనసాగుతోంది.. ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అని ట్విట్టర్ ద్వారా మండిపడుతోంది. ఇదిలా ఉంటే బీఎంసీ అధికారులు మాత్రం కంగాన.. అక్రమ కట్టడం చేపట్టినందువల్లే కూల్చివేశామంటున్నారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభమైనట్టు తెలిపారు. కంగన బుధవారం ఉదయమే తన భద్రతా సిబ్బందితో కలిసి హిమాచల్ ప్రదేశ్ లోని కోఠిలోని ఓ దేవాలయంలో ప్రార్ధనలకు వెళ్లారు.

Tags

Next Story