Kangana Ranaut : బాలీవుడ్ నటి కంగన కారును చుట్టుముట్టిన పంజాబ్ రైతులు..!
Kangana Ranaut : బాలీవుడ్ నటి కంగనకు పంజాబ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారును కొందరు రైతులు అడ్డుకున్నారు. పంజాబ్‌లోని చండీగఢ్ - ఉనా జాతీయ రహదారిపై కిరాత్‌పుర్ సాహిబ్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.
BY vamshikrishna4 Dec 2021 3:51 AM GMT

X
vamshikrishna4 Dec 2021 3:51 AM GMT
Kangana Ranaut : బాలీవుడ్ నటి కంగనకు పంజాబ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారును కొందరు రైతులు అడ్డుకున్నారు. పంజాబ్‌లోని చండీగఢ్ - ఉనా జాతీయ రహదారిపై కిరాత్‌పుర్ సాహిబ్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పంజాబ్‌లో ప్రవేశించగా.. ఓ మూక తన కారుపై దాడి చేసిందని, తాము రైతులమని వారు చెబుతున్నారంటూ కంగన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. రైతు ఉద్యమంపై ఆమె పలుమార్లు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
రైతులను విమర్శిస్తూ గతంలో చేసిన వ్యాఖ్యలకు గానూ ఆమె నుంచి వారు క్షమాపణ కోరినట్లు తెలుస్తోంది. అయితే, కాసేపటికే అక్కడకు చేరుకున్న పోలీసులు రైతులకు సర్దిచెప్పారు. దీంతో అక్కడి నుంచి కంగన పయనమయ్యారు. ఈ సందర్భంగా పంజాబ్ పోలీసులకు కంగన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు తన అభిప్రాయాలను వ్యతిరేకిస్తున్న కొందరు తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఇటీవలే ఆమె వెల్లడించారు. దీనిపై పంజాబ్ పోలీసులకు ఇటీవలే ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు తాను భయపడడనని, తనను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పంజాబ్ సీఎంకు సూచించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా విజ్ఞప్తి చేశారు కంగన..
Next Story