Karnataka: గాలి ఖజానాకు మరో గండి...

Karnataka: గాలి ఖజానాకు మరో గండి...
గాలి ఆస్తుల జప్తుకు లైన్‌ క్లియర్‌; CBIకి కర్ణాటక సర్కార్‌ అనుమతి; 19 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసేందుకు లైన్‌ క్లియర్‌; ఇప్పటికే గాలికి చెందిన 64 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు

మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి ఖజానాకు మరో గండి పడింది. కొత్త రాజకీయ పార్టీని అనౌన్స్ చేసి మంచి ఊపు మీద ఉన్న గాలి వాటం చూసి కర్ణాటక ప్రభుత్వానికి సైతం కన్నుకుట్టిందో ఏమో అతడి ఆస్తి జప్తుకు ఆదేశాలు జారీ చేసింది.


జనార్దనరెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న రూ. 19 కోట్ల ఆస్తులను జప్తు చేసేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ మేరకు సీబీఐకి కర్ణాటక రష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే గాలికి చెందిన రూ. 64 కోట్ల ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.


మరో రూ. 19 కోట్ల ఆస్తి జప్తు కోసం గత ఏడాది ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని సీబీఐ కోరింది. దీంతో ప్రభుత్వ జాప్యంపై సీబీఐ అధికారులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యం జరిగిందని కోర్టుకు చెప్పిన ప్రభుత్వం... ఇపుడు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.


'కల్యాణ రాజ్య ప్రగతి పక్ష' పేరిట రాజకీయ పార్టీ పెట్టిన జనార్దనరెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. తన ప్రజలకు సేవ చేస్తానంటూ స్పీచ్ లు దంచేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ జప్తు ఆదేశాల వల్ల మైనింగ్ మాఫియా కింగ్ ఖజానాకు భారీ గండి పడినట్లేనని చెప్పాలి. అయితే, మైనింగ్ మాఫియా ద్వారా ఆయన కూడబెట్టిన దానికి ఇది ఏమాత్రం అనే వారు సైతం ఉన్నారు. మరి ప్రభుత్వం చేపట్టిన యాక్షన్ కు గాలి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.




Tags

Read MoreRead Less
Next Story