Karnataka : ఎన్నికల బరిలో ఈగ విలన్.!?

Karnataka : ఎన్నికల బరిలో ఈగ విలన్.!?
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా సుదీప్ ను నియమించే అవకాశం

ఈగ విలన్, కన్నడ నటుడు కిచ్చా సుదీప్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు సుదీప్. దీంతో కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్నారని సమాచారం. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం మర్యదపూర్వకంగానే సుదీప్ కలిశారని తెలిపాయి.

సుదీప్ పొలిటికల్ ఎంట్రీ మాత్రం ఫిక్స్ అయినట్లు సమాచారం. డీకే శివకుమార్‌, సుదీప్ మధ్య కర్ణాటక ఎన్నికలతో పాటు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కిచ్చా సుదీప్‌ పొలిటికల్ ఎంట్రీ ఖాయమని, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది తెలియాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా సుదీప్ ను నియమించే అవకాశముందని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story