Karnataka : శివమొగ్గ ఎయిర్ పోర్ట్ కు యడ్యూరప్ప పేరు..!?

Karnataka : శివమొగ్గ ఎయిర్ పోర్ట్ కు యడ్యూరప్ప పేరు..!?
యడ్యూరప్ప 80వ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 27న ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు

కర్ణాటక శివమొగ్గలోని కొత్త విమానాశ్రయానికి కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప పేరును పెట్టాలని ఆరాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇందుకుగాను సిఫార్సుతో కూడిన ప్రతిపాదనను సీఎం బోమ్మై కేంద్రానికి పంపనున్నారు. యడ్యూరప్ప 80వ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 27న ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు.

కర్ణాటక సీఎం బొమ్మై ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... యడ్యూరప్ప సహకారం వల్లే ఎయిర్ పోర్ట్ సాకారమైందని అన్నారు. అందుకే యడ్యూరప్ప పేరును విమానాశ్రయానికి పెట్టేందుకు ప్రతిపాదించామని తెలిపారు. గత సంవత్సరం ఈ పేరును ప్రతిపాదించినప్పుడు తన పేరును పెట్టవద్దని కోరారు యడ్యూరప్ప. "విమానాశ్రయానికి నా పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు. కానీ.. దేశానికి సేవచేసిన వారు, దేశ అభివృద్ధికి తోడ్పడిన వారు చాలా మంది ఉన్నారు. విమానాశ్రయానికి నా పేరు పెట్టడం సరైన నిర్ణయం కాదని నేను భావిస్తున్నాను. మీ నిర్ణయాన్ని పునరాలోచించుకుని దేశ అభ్యున్నతికి తోడ్పడిన వారి పేరు పెట్టాలని అభ్యర్థిస్తున్నాను" అని యడ్యూరప్ప రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

సీఎం పదవినుంచి యడ్యూరప్పను తొలగించినప్పటి నుంచి ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన్ని బుజ్జగించే ప్రక్రియలో భాగంగానే విమానాశ్రయానికి యడ్యూరప్పపేరును కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story